Header Banner

విదేశాల్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సంబరాలు.. ఎన్నారై టీడీపీ, తెలుగు సంఘాల సంయుక్తంగా నిర్వహణ‌!

  Fri Jun 06, 2025 12:26        Australia, Politics

న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలోని ముఖ్య నగరాలలో జరిగే 75 సంవత్సరాల ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవం, సీబీఎన్‌ 75 ఇయర్స్‌ వేడుకల ఉమ్మడి కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్ధన్‌, ప్రత్యేక అతిథి ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణలు గురువారం పయనమై వెళ్లారు. ఎన్నారై టీడీపీ, తెలుగు సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో మొదటిది ఈరోజు న్యూజిలాండ్‌ రాజధాని ఆక్లాండ్‌లో జరుగుతుంది. దీనికి తెలుగుదేశం శాసనసభ్యులు బోడే ప్రసాద్‌, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ వైస్ ఛైర్మన్‌ అశ్విన్‌ అట్లూరి కూడా పాల్గొంటున్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు జూమ్‌ ద్వారా పాల్గొంటున్నారు. జూన్‌ 7న మెల్బోర్న్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథి టి.డి.జనార్ధన్‌తో పాటు నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, బోడే ప్రసాద్‌, అశ్విన్‌ అట్లూరి పాల్గొంటారు.

 

ఇది కూడా చదవండి: రాష్ట్రపతి, ప్రధాని, రైల్వే మంత్రికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు..కొత్త బాధ్యతల్లో సందీప్ మాథుర్!

 

జూమ్‌ ద్వారా రఘురామకృష్ణaరాజు తమ సందేశాన్ని ఇస్తారు. జూన్‌ 8న అడిలైడ్‌ నగరంలో జరిగే 75 సంవత్సరాల ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవం, సీబీఎన్‌ 75వ జన్మదినం వేడుకలలో ముఖ్య అతిథులుగా టి.డి.జనార్ధన్‌, నందమూరి రామకృష్ణ, బోడే ప్రసాద్‌, నారా రోహిత్‌, అశ్విన్‌ అట్లూరి, నన్నూరి నర్సిరెడ్డి పాల్గొంటారు. జూన్‌ 9న సిడ్నీ నగరంలో జరిగే కార్యక్రమంలో టి.డి. జనార్ధన్‌, నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, బోడే ప్రసాద్‌, అశ్విన్‌ అట్లూరిలతో పాటు ప్రముఖ సినీ యువనటుడు నారా రోహిత్‌, తెలుగుదేశం సీనియర్‌ నేత, టీటీడీ సభ్యుడు నర్సిరెడ్డి పాల్గొంటారు. జూన్‌ 11న బ్రిస్బేన్‌ నగరంలో జరిగే మినీ మహానాడు, ఎన్టీఆర్‌ సినీవజ్రోత్సవ కార్యక్రమాల్లో టి.డి.జనార్ధన్‌, నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, బోడె ప్రసాద్‌, నారా రోహిత్‌, అశ్విన్‌ అట్లూరి, నన్నూరి నర్సిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఈ కార్యక్రమాలలో స్థానికంగా ఉన్న తెలుగు సంఘాల ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NTR #NTRcinematicDiamondJubilee #CBN75years #TDJanardhan #NandamuriRamakrishna #TeluguDesamParty #Australia #NewZealand #NaraRohit #TeluguSanghams